ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు బహుకరించిన తెలంగాణ డీజీపీ

Related image

  • రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి 209 మంది ఫంక్షనల్ వర్టికల్స్ పోలీస్ అధికారులకు డీజీపీచే ప్రశంసా  పత్రాల బహుకరణ
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, గోవింద్ సింగ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిఐడి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుండి ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరు విధానం మరియు టెక్నాలజీ ఉపయోగించడంపై ఆన్ లైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయంలోని పోలీసు అధికారులు మరియు ఫంక్షనల్ వర్టికల్స్ అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి అక్టోబర్ వరకు, ప్రతి పోలీస్ యూనిట్ లోని ఫంక్షనల్ వర్టికల్స్ లో వారు సాధించిన పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి స్థాయిలోని ఫంక్షనల్ వర్టికల్స్ అధికారుల యొక్క పనితీరును సాంకేతికంగా విశ్లేషించి, గణాంకాలలో మార్చి గ్రేడింగ్ ఇవ్వడం మరియు ప్రోత్సహించడం ద్వారా మొత్తం పోలీసు వ్యవస్థ యొక్క పనితీరును ఏ విధంగా మెరుగుపరచవచ్చు అనే విషయాన్ని రాష్ట్ర డీజీపీ తెలియజేశారు.

అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకరూప పోలీస్ సేవలు అందించడం ద్వారా, ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి వచ్చి సత్ఫలితాలు సాధించవచ్చు అనే విషయాన్ని వారు స్పష్టపరిచారు. ఫంక్షనల్ వర్టికల్ విధానం ద్వారా ప్రతి పోలీస్ అధికారి, తన విధుల పట్ల, సాధించవలసిన ఫలితాల పట్ల స్పష్టత ఏర్పడి, నైపుణ్యాన్ని పెంపొందించుకుని, జవాబుదారీతనంతో పనిచేస్తూ తన లక్ష్యాన్ని సులభంగా సాధిస్తూ, డిపార్ట్మెంట్ నందు పేరు ప్రతిష్టలు పెంపొందించుకోవడమే కాకుండా తమ ప్రతిభ కనుగుణంగా గుర్తింపు ఎలా పొందవచ్చునో  వివరించారు.

రాష్ట్ర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా, ప్రతి పోలీస్ అధికారి యొక్క ప్రతిభను నిర్దేశించడానికి రూపొందించినటువంటి “కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్” మరియు సాంకేతిక కొలమానాల ద్వారా, పనితీరును విశ్లేషించి, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన 209 మంది వివిధ స్థాయిలలోని పోలీసు అధికారులకు (రిసెప్షన్, స్టేషన్ రైటర్, బ్లూ కోల్ట్స్, పెట్రోల్ కారు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్, వారెంట్లు, ఎస్.హెచ్.ఓ, ట్రాఫిక్ మొదలైన,) రాష్ట్ర డీజీపీ ప్రశంసా పత్రాలతో, ఏక సమయంలో సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమం నందు శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ (రైల్వేస్) సందీప్ శాండిల్య, నార్త్ జోన్ ఐజిపి వై.నాగిరెడ్డి మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

More Press Releases