జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్ర అటవీ కళాశాల, పరిశోధనాసంస్థ విద్యార్థులు సత్తా

Related image

  • ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రకల్చరల్ రీసెర్చ్ (ICAR) ప్రవేశ పరీక్షల్లో పది మంది విద్యార్థులకు ర్యాంకులు
ఐసీఏఆర్(Indian Council of Agricultural Research) జాతీయ ప్రవేశ పరీక్షలో తెలంగాణ అటవీ కళాశాల(FCRI)
విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం పది మందికి టాప్ ర్యాంకులు వచ్చాయి.

అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందికి తోడు, కళాశాలలోని మౌలిక వసతులు, ప్రయోగాత్మక శిక్షణతోనే ర్యాంకులు సాధించినట్లు డీన్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. మంచి ప్రతిభతో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, PccF శోభ, ఇతర అధికారులు అభినందించారు.

పీజీ ప్రవేశాల కోసం ఐసీఏఆర్ నిర్వహించిన ప్రవేశపరీక్షలో తెలంగాణ రాష్ట్ర అటవీకళాశాల, పరిశోధనా సంస్థ విద్యార్థులు సత్తా చాటి జాతీయస్థాయిలో మంచి ర్యాంకులు సాధించారు. ఎఫ్ సీఆర్ఐ విద్యార్థుల్లో బి.వెంకటేశ్వర్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంకు, హుస్నా తక్వీం ఎనిమిదో ర్యాంకు దక్కించుకున్నారు. సీహెచ్ భార్గవి ఓపెన్ కేటగిరీలో 14వ, ఓబీసీ కేటగిరీలో ఎనిమిదో ర్యాంకు సాధించారు. దివ్యాంగుల కేటగిరీలో అమిత్ రెడ్డి మొదటి ర్యాంకు దక్కించుకోగా.. ఎస్సీ కేటగిరీలో ఇందు కాలె, అనిష్ ఐదు, ఆరు ర్యాంకులను సాధించారు. తేజశ్రీ ఓబీసీ కేటగిరీలో ఆరోర్యాంకు దక్కించుకోగా.. పి.కళ్యాణి ఓపెన్ కేటగిరీలో 29వ, ఓబీసీ కేటగిరీలో 15వ ర్యాంకు పొందింది.

డెహ్రాడూన్ లోని ఎఫ్ఆర్ఐ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఐసీఏఆర్-ఏఐఈఈఏ పీజీ ప్రవేశపరీక్షలోనూ ఎఫ్ సీఆర్ఐ విద్యార్థులు జాతీయస్థాయిలో మంచి ర్యాంకులు సంపాదించారు. 2016లో ఏర్పాటు చేసిన ఎఫ్ సీఆర్ఐ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులు 2020 జూన్ లో విజయవంతంగా కోర్సు పూర్తి చేసున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ ఎమ్మెస్సీ ప్రవేశాల కోసం మంచి విశ్వ విద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశాలు దక్కాయి. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లోనూ ఎఫ్ సీఆర్ఐ విద్యార్థులు అవకాశం దక్కించుకున్నారు. అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో ఎఫ్ సీఆర్ఐకి చెందిన సూర్యదీపిక, సుహర్ష ప్రవేశాలు పొందారు.

విద్యార్థుల విజయం వెనుక బోధనా సిబ్బంది కృషి ఉందని, వారికే ఈ ఘనత దక్కుతుందని కళాశాల డీన్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ శివారు ములుగులో ఉన్న కళాశాలలోని వసతులు, 14 ప్రయోగశాలలతో పాటు సెమినార్ హాల్, ఆడిటోరియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటి ప్రపంచస్థాయి సౌకర్యాలు కూడా ఇందుకు దోహదపడ్డాయని తెలిపారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ఫ్యాకల్టీని అభినందించిన డీన్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను నెరేవెర్చే దిశగా కష్టపడి పని చేయాలని కోరారు.

More Press Releases