'ఓ పిట్టకథ' మూవీ రివ్యూ

07-03-2020 Sat 10:47
Movie Name: O Pitta Katha
Release Date: 2020-03-06
Cast: Viswanth, Sanjay Rao, Nithya Shetty, Brahmaji, Balaraju 
Director: Chandu Muddu 
Producer: V. Anand Prasad
Music: Praveen Lakkaraju 
Banner: Bhavya Creations 

ప్రభు .. వెంకటలక్ష్మి ఎంతో గాఢంగా ప్రేమించుకుంటారు. ఆ విషయాన్ని వెంకటలక్ష్మి తండ్రికి చెప్పాలని ప్రభు అనుకుంటున్న సమయంలోనే, దగ్గరి బంధుత్వం చెప్పుకుని వెంకటలక్ష్మి ఇంట్లోకి క్రిష్ ఎంటరవుతాడు. వెంకటలక్ష్మి కోసం కథానాయకులు పోటీ పడుతుండగా, హఠాత్తుగా ఆమె అదృశ్యమవుతుంది. ఆమె హత్యకి సంబంధించిన వీడియో పోలీసుల చేతికి చిక్కుతుంది. ఆమె ప్రేమికులిద్దరిలో నేరస్థులు ఎవరు? అనే కోణంలో ఈ కథ సాగుతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే సస్పెన్స్ తో కూడిన ఈ ప్రేమకథ, ఓ మాదిరిగా అనిపిస్తుంది.

గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ప్రేమకథలు చాలా వరకూ ఆహ్లాదంగా సాగుతాయి. పల్లె అందాలు తోడై ఆ ప్రేమకథలకు  మరింత సొగసును తీసుకొస్తాయి. గ్రామీణ నేపథ్యంలోని పాత్రలు .. పాటలు కూడా చాలా త్వరగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. అలాంటి ఒక ప్రేమకథకు సస్పెన్స్ ను జోడించి, ఓ మిస్సింగ్ మిస్టరీ చుట్టూ ఆడియన్స్ ను తిప్పే ప్రయత్నాన్ని దర్శకుడు చెందు ముద్దు చేశాడు. ఆయన చెప్పిన పిట్టకథ ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో ఇప్పుడు చూద్దాం.

'కాకినాడ'లో వీర్రాజుకి ఓ పెద్ద బంగ్లా .. ఓ సినిమా థియేటర్ ఉంటాయి. ఆయన ఒక్కగానొక్క కూతురే వెంకటలక్ష్మి (నిత్యా శెట్టి). తల్లి లేని పిల్ల కావడంతో ఎంతో గారంగా పెంచుతాడు. అతని సినిమా థియేటర్లో చిన్నతనం నుంచే ప్రభు (సంజయ్) పనిచేస్తుంటాడు. అతనితో వెంకటలక్ష్మికి గల చనువు ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో వీర్రాజు ఇంటికి విదేశాల నుంచి క్రిష్ (విశ్వంత్) వస్తాడు. మేనల్లుడినని చెప్పుకుని ఆ ఇంట్లో తిష్టవేస్తాడు. చెల్లెలితో మాటలు లేకపోవడం వలన, మేనల్లుడు వచ్చినందుకు వీర్రాజు చాలా సంతోష పడతాడు.

వెంకటలక్ష్మిని తను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి వీర్రాజు ఇంటికి వచ్చిన ప్రభు, అక్కడ క్రిష్ ను చూసి మౌనంగానే వెనుదిరుగుతాడు. వెంకటలక్ష్మిపై మనసు పారేసుకున్న క్రిష్, ఆమెతో ప్రభు చనువుగా ఉండటాన్ని సహించలేకపోతాడు. వెంకటలక్ష్మి పట్ల తనకి గల ప్రేమను వీర్రాజు దగ్గర వ్యక్తం చేస్తాడు. మేనల్లుడే కావడంతో తన కూతురు నివ్వడానికి వీర్రాజు అంగీకరిస్తాడు. అలాంటి పరిస్థితుల్లోనే, స్నేహితులతో కలిసి 'అరకు' వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళుతుంది వెంకటలక్ష్మి. అలా వెళ్లిన ఆమె తిరిగిరాదు. దాంతో పోలీస్ స్టేషన్లో వీర్రాజు ఫిర్యాదు చేస్తాడు.

వెంకటలక్ష్మి మిస్సింగ్ మిస్టరీని ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ అజయ్ రావు( బ్రహ్మాజీ) రంగంలోకి దిగుతాడు. వెంకటలక్ష్మితో చనువుగా ఉంటున్న క్రిష్ ను .. ప్రభును పిలిపించి విచారణ చేపడతాడు. ఆ సమయంలోనే వెంకటలక్ష్మి హత్యకి సంబంధించిన ఒక వీడియో ఆయనకి చేరుతుంది. ఆ వీడియో చూసిన పోలీస్ ఆఫీసర్ షాక్ అవుతాడు. అందులో వున్నది ఎవరు? నిజంగానే వెంకటలక్ష్మి హత్య చేయబడిందా? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

దర్శకుడు చెందు ముద్దు 'ఓ పిట్ట కథ' అంటూ చాలా పెద్ద కథనే చెప్పే ప్రయత్నం చేశాడు. గ్రామీణ నేపథ్యంతో కూడిన  ప్రేమకథను బాగానే రాసుకున్నాడు. అయితే ఫస్టాఫ్ లో ఆ విషయాన్ని క్రిస్ప్ గా .. ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు. చాలా సన్నివేశాలు అవసరానికి మించి సాగుతాయి. ఇద్దరు కథానాయకులు .. నాయిక మధ్య దాగుడుమూతలతోనే ఫస్టాఫ్ గడిచిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగును మాత్రం దర్శకుడు బాగానే సెట్ చేశాడు. అక్కడి నుంచి కథ సస్పెన్స్ తో సాగుతుంది. హంతకుడు ఎవరు? అనే విచారణలో ట్విస్టులను కూడా బాగానే రాసుకున్నాడు.

ఒకే కథను .. ఒకే సందర్భంలోని సన్నివేశాలను ఒక్కొక్కరి కోణంలో ఒక్కోలా చూపిస్తూ దర్శకుడు స్క్రీన్ ప్లే తో చేసిన మ్యాజిక్ ఈ సినిమాకి చాలావరకూ ఆయువుగా నిలిచింది. కామెడీ సీన్స్ ను సరిగ్గా రాసుకోకపోవడం .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతను ఇవ్వకపోవడం .. అనవసరమైన ఫ్లాష్ బ్యాక్ లు .. ఏ సన్నివేశాన్ని ఎంతవరకు చెప్పాలి అనే విషయంలో అనుభవలేమి .. ప్రేక్షకులను కాస్తంత అసహనానికి గురిచేస్తాయి.

క్రిష్ పాత్రలో విశ్వంత్ ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించాడు. పాత్రలో అతను ఇంకా ఇన్వాల్వ్ కావలసి వుంది. ప్రభు పాత్ర ద్వారా ఈ సినిమాతోనే బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు పరిచయమయ్యాడు. పల్లెటూరికి చెందిన ఓ సాధారణ యువకుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించాడు. అయితే కథానాయికతో లవ్ .. రొమాన్స్ .. పాటల్లో ఆయన సెట్ కాలేదు. పసితనం పోని కథానాయిక జోడీగా ఆయన చాలా ముదురుగా కనిపించడంతో ఆడియన్స్ ఫీల్ మిస్సయ్యారు. తొలి సినిమాలో తడబడకుండా చేసినా, ఇకపై తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటే రాణించే అవకాశం వుంది. హీరోయిన్ నిత్యా శెట్టి అల్లరి పిల్ల పాత్రలో ఆకట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ కావడం వలన, తనకిచ్చిన పాత్రను అవలీలగా చేసేసింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బ్రహ్మాజీ తన మార్క్ చూపించాడు. మిగతా వాళ్లంతా ఓకే అనిపించారు.

ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం ఫరవాలేదు. ఆయన స్వరపరిచిన బాణీల్లో 'ఏదో ఏదో .. ' పాట ఆకట్టుకునేలా వుంది. రీ రికార్డింగ్ కూడా ఫరవాలేదు. సునీల్ కుమార్ కెమెరా పనితనం బాగుంది. గ్రామీణ నేపథ్యంలోని సన్నివేశాలను .. పాటలను ఆయన చాలా అందంగా ఆవిష్కరించాడు. వెంకట్ ప్రభు ఎడిటింగ్ విషయానికొస్తే, ఫస్టాఫ్ లో ఆయన కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయవచ్చు. వీర్రాజు లవ్ స్టోరీ .. వెంకటలక్ష్మి - ప్రభు చిన్నప్పటి ఎపిసోడ్ .. ప్రభు - ఫ్రెండ్  మధ్య సాగే కామెడీ సీన్స్ ఈ సినిమా స్థాయిని తగ్గించాయి. సంభాషణల్లో గుర్తుపెట్టుకోదగినవేం లేవు.

నిదానంగా సాగే కథ .. అనవసరమైన సన్నివేశాలు .. పసలేని కామెడీ ట్రాక్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.  గ్రామీణ నేపథ్యం ..  దర్శకుడికి స్క్రీన్ ప్లే పై వున్న పట్టు, సంగీతం .. ఫొటోగ్రఫీ చేసిన సపోర్ట్ కారణంగా ఈ సినిమా ఓ మాదిరిగా వుందనిపిస్తుంది.          


More Articles
Advertisement
Telugu News
hero heroin get emotion
‘సూపర్‌ ఓవర్‌’ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో హీరో, హీరోయిన్ల క‌న్నీరు!
32 minutes ago
sohel goes chiru home
మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లిన బిగ్‌బాస్ ఫేం సోహెల్... ఫొటోలు వైర‌ల్
1 hour ago
I have a deal with Siva Karthikayan says Rakul Preet Singh
శివ కార్తికేయన్ తో ఒక డీల్ కుదుర్చుకున్నా: రకుల్ ప్రీత్ సింగ్
1 hour ago
Chiranjeevi confirms film with Bobby
మరో సినిమాను ఖరారు చేసిన మెగాస్టార్!
1 hour ago
Actress Sri Sudha again complaint against shyam k naidu
సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె నాయుడిపై సినీ నటి శ్రీసుధ మరోమారు ఫిర్యాదు
4 hours ago
Samanta learning horse riding for her next movie
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
4 hours ago
Boyapati to direct Tamil hero Surya
సూర్య తెలుగు సినిమా.. బోయపాటి డైరెక్షన్?
19 hours ago
mahesh wishes namrata
నేను ప్రేమించిన అమ్మాయి ఈ రోజే జన్మించింది: మ‌హేశ్ బాబు
22 hours ago
Kajal Aggarwal to pair with Prabhu Deva
ప్రభుదేవా, కాజల్ జంటగా రొమాంటిక్ కామెడీ సినిమా!
1 day ago
Prashanth Neil says salar is not remake of Ugram
ఆ కన్నడ సినిమాకి, 'సలార్'కి సంబంధం లేదంటున్న దర్శకుడు!
1 day ago