పెర్త్ టెస్టు... స్టడీగా ఆడుతున్న భార‌త ఓపెన‌ర్లు... 200 దాటిన టీమిండియా ఆధిక్యం

  • పెర్త్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా తొలి టెస్టు
  • రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శ‌త‌కాల‌తో చెల‌రేగిన భార‌త ఓపెన‌ర్లు
  • అజేయంగా సెంచ‌రీ భాగ‌స్వామ్యం
  • ప్ర‌స్తుతం 212 ప‌రుగుల లీడ్‌లో టీమిండియా
బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త జ‌ట్టు ప‌ట్టు బిగించింది. ఆతిథ్య జ‌ట్టును తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 104 ప‌రుగుల‌కే కుప్ప‌కూల్చిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో కుదురుగా ఆడుతోంది. ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్ (88), కేఎల్ రాహుల్ (59) అర్ధ శ‌త‌కాలు న‌మోదు చేశారు. అలాగే తొలి వికెట్‌కు శ‌త‌క భాగ‌స్వామ్యం అందించారు. 

మొద‌టి ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌లుపుకొని టీమిండియా ప్రస్తుతం 53 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 212 పరుగుల లీడ్‌లో ఉంది. అంత‌కుముందు భార‌త జ‌ట్టు త‌న తొలి ఇన్నింగ్స్ లో 150 ర‌న్స్‌కి ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే. ఇవాళ‌ కేవ‌లం రెండో రోజు ఆట కావ‌డంతో ఈ మ్యాచ్‌లో ఫ‌లితం రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ వికెట్ న‌ష్ట‌పోకుండా 166 ప‌రుగులు (53 ఓవ‌ర్లు) చేసింది. 


More Telugu News