PV Sindhu: సీఎం రేవంత్ రెడ్డిని తన వివాహానికి ఆహ్వానించిన పీవీ సింధు

PV Sindhu met CM RevanthReddy  and invited him to her wedding

  • జుబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కలిసిన పీవీ సింధు
  • ఆహ్వాన పత్రికను అందించిన పీవీ సింధు
  • ఈ నెల 22న రాజస్థాన్‌లో పీవీ సింధు వివాహం

భారత ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించారు. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లోని జుబ్లిహిల్స్‌లో గల ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఆహ్వాన పత్రికను సీఎంకు అందించారు. సీఎం... ఆమెకు శాలువా కప్పి సన్మానించారు.

పీవీ సింధు వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది. పీవీ సింధుకు కాబోయే వరుడి పేరు వెంకటదత్తసాయి. ఈరోజు ఎంగేజ్‌మెంట్ జరిగింది. తమ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఒకరి ప్రేమ దక్కిన సమయంలో మనం తిరిగి ప్రేమించాలి అనే కాప్షన్‌తో ఈ పోస్ట్ చేశారు. 
 

  • Loading...

More Telugu News