Gukesh: వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్ గుకేశ్ ఎంత ప్రైజ్ మ‌నీ గెలిచాడంటే..!

How Much Prize Money Did D Gukesh Win For Historic Triumph Over Ding Liren

  • 18 ఏళ్ల‌కే వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్‌గా నిలిచిన గుకేశ్‌
  • చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం
  • విజేత గుకేశ్‌కు రూ. 11.45 కోట్లు 
  • ర‌న్న‌ర‌ప్ డింగ్‌కు రూ. 9.75 కోట్లు

భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విష‌యం తెలిసిందే. చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ను ఓడించి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ గా అవ‌త‌రించాడు. 18 ఏళ్లకే ఇలా వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్‌గా నిలిచాడు. త‌ద్వారా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

అయితే, వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్‌గా నిలిచిన గుకేశ్‌కు ఎంత ప్రైజ్ మ‌నీ ద‌క్కుతుంద‌నేది చాలా మంది మ‌దిలో మెదిలే ప్ర‌శ్న‌. కాగా, గుకేశ్‌కు ట్రోఫీతో పాటు 1.35 మిలియ‌న్ డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ అందుతుంది. అలాగే ర‌న్న‌ర‌ప్ డింగ్‌కు 1.15 మిలియ‌న్ డాల‌ర్లు (రూ. 9.75కోట్లు) ద‌క్క‌నుంది. 

మొత్తం ఛాంపియ‌న్‌షిప్ ప్రైజ్ మ‌నీ రూ. 21.75 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ఆట‌గాడికి రూ. 1.69 కోట్లు ఇస్తారు. దీని ప్ర‌కారం 3 గేమ్‌లు గెలిచిన‌ గుకేశ్‌కు రూ. 5.09 కోట్లు, రెండు గేమ్‌లు గెలిచిన‌ డింగ్‌కి రూ. 3.39 కోట్లు లభిస్తాయి. మిగిలిన దాన్ని స‌మానంగా పంచుతారు. దాంతో గుకేశ్‌కు మొత్తం రూ. 11.45 కోట్లు ద‌క్క‌నుండ‌గా, డింగ్ రూ. 9.75 కోట్లు అందుకోనున్నాడు. ఈరోజు ట్రోఫీ ప్ర‌దాన కార్య‌క్ర‌మం ఉంది. 

  • Loading...

More Telugu News