Car Return: షోరూమ్ వాళ్లు కారు వాపసు తీసుకోలేదు... ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి!
మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది బాగా లేకపోతే కొన్నిసార్లు వాపసు ఇస్తుంటాం. కొందరు దుకాణాదారులు ఆ వస్తువులు రిటర్న్ తీసుకుని, వేరే వస్తువులు ఇస్తుంటారు. అయితే అమెరికాలో ఓ వ్యక్తి వారం రోజుల కిందట ఓ కారు కొని, అది నచ్చకపోవడంతో వాపసు ఇచ్చేందుకు ప్రయత్నించాడు.
కారును రిటర్న్ చేస్తాను... నా డబ్బు నాకిచ్చేయండి అంటూ అడిగాడు. కానీ, షోరూమ్ నిర్వాహకులు ఒప్పుకోకపోవడంతో అతడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చి షోరూమ్ ను ఢీకొట్టాడు.
కారుతో అద్దాలను బద్దలు కొట్టుకుంటూ షోరూమ్ లోకి దూసుకొచ్చాడు. అనంతరం, షోరూమ్ సిబ్బందిని దూషిస్తూ అక్కడ్నించి వెళ్లిపోయాడు. అమెరికాలోని ఉటాలో జరిగిందీ ఘటన. కార్ల షోరూమ్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.