Sudents Escape: విశాఖలో నలుగురు విద్యార్థులు హాస్టల్ నుంచి పరారైన వీడియో వైరల్

Video emerged four students escaped from hostel

  • లక్కీ భాస్కర్ సినిమాతో ప్రభావితులైన విద్యార్థులు
  • అందులో హీరోలా ఇళ్లు, కార్లు సంపాదిస్తామంటూ వెళ్లిపోయిన వైనం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఇటీవల వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా చూసి, అందులో హీరోలాగా తాము కూడా భారీగా డబ్బు సంపాదించాలని విశాఖలో నలుగురు విద్యార్థులు హాస్టల్ నుంచి పరారైన సంగతి తెలిసిందే. ఆ నలుగురు విద్యార్థులు విశాఖలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదువుతున్నారు. వారు హాస్టల్ నుంచి పారిపోయిన విజువల్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజి వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ముందు తమ బ్యాగులు బయటకు విసిరేసిన విద్యార్థులు, ఆ తర్వాత ఒక్కొక్కరుగా గేటు దూకి పారిపోయారు. వారు, రోడ్డుపై పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా మరో సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. 

కాగా, విద్యార్థుల అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News