young woman: కారు బానెట్‌పై బంగారు నగలు... యువతి వింత ప్రయోగం!

young woman putting her gold jewelery on car bonnet to check whether it will be stolen or not video going viral

  • దుబాయ్‌ రోడ్డులో కారు బా‌నెట్‌పై బంగారు నగలు పెట్టి పరీక్ష చేసిన యువతి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్ 
  • అరగంట పాటు కారు బానె‌ట్‌పై నగలు ఉన్నా ఎవరూ తీసుకువెళ్లని వైనం
  • ఇలాంటి రక్షణ ఉన్న ఒకే ఒక్క దేశం దుబాయ్ అంటూ యువతి కితాబు  

దుబాయ్‌కి చెందిన ఓ యువతి చేసిన వింత ప్రయోగ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తోంది. బహిరంగ ప్రదేశంలో బంగారు నగలు పెడితే చోరీకి గురవుతాయో లేదో అని తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఓ యువతి టెస్ట్ నిర్వహించింది. తన మెడలోని బంగారు హారం, ఉంగరాలు తీసి రోడ్డుపై ఉన్న కారు బానెట్‌పై పెట్టిన ఆ యువతి అక్కడి నుంచి కొద్ది దూరంలో ఉన్న దుకాణంలోకి వెళ్లి తన బంగారు నగలు ఎవరైనా తీసుకువెళతారా లేదా అని దూరం నుండి గమనిస్తూ ఉంది. 

దాదాపు అరగంట వరకూ ఆమె వేచి చూసినా, చాలా మంది అటూ ఇటూ తిరుగుతున్నా ఎవరూ ఆ నగలను పట్టించుకోలేదు. ఆ నగలను ఎత్తుకెళ్లిపోవాలని ఎవరూ ప్రయత్నించలేదు. అరగంట తర్వాత ఆమె అక్కడకు వెళ్లి తన నగలను తీసేసుకుంది. రోడ్డుపై బంగారు నగలను ఉంచినా ఎవరూ ముట్టకోకపోవడంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ .. ఇలాంటి రక్షణ ఉన్న ఒకే ఒక్క దేశం దుబాయ్ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో సదరు వీడియో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హాల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 
 
దుబాయ్‌లో దొంగతనం చేస్తే కఠిన శిక్షలు విధిస్తారు .. అందుకే అక్కడ చోరీలు జరిగే అవకాశాలు చాలా తక్కువ అని కొందరు, ఇలాంటి టెస్ట్ ఇండియాలో పెడితే బంగారంతో పాటు కారు కూడా కనబడదు అంటూ మరి కొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోను 28లక్షల మందికి పైగా వీక్షించగా, 11లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి.    

  • Loading...

More Telugu News