TGPSC: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల వివరాలు

tgpsc group 2 exam details for 15th and 16th of this month

  • ఈ నెల 15,16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు
  • 33 జిల్లాల్లో 1,368 కేంద్రాల్లో పరీక్షలు
  • రేపటి నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి హాల్ టికెట్లు

తెలంగాణలో గ్రూప్ -2 పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి వివరాలను వెల్లడించింది. ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 సెంటర్‌లలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పింది.

సోమవారం నుంచి హాల్ టికెట్లు డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని తెలిపింది. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం సెషన్‌లో 8.30 నుంచి 9.30 గంటల వరకు.. మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఆ తర్వాత వచ్చిన వారికి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వరని అభ్యర్ధులకు టీజీపీఎస్సీ తెలిపింది. 
.

  • Loading...

More Telugu News