PSLV C59: పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ ప్రయోగం సక్సెస్... శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్

ISRO Chairman congratulates scientists after PSLV C50 launching grand success

  • శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సి50 ప్రయోగం
  • నిర్దేశిత కక్ష్యలోకి ప్రోబా-3 ఉపగ్రహాలు
  • ప్రకటన చేసిన ఇస్రో

శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించిన పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ అత్యంత కచ్చితత్వంతో, నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. 

ఈ ప్రయోగం సక్సెస్ అయిన నేపథ్యంలో, ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు. సూర్యుడి బాహ్య వాతావరణం కరోనాపై ప్రోబా ఉపగ్రహాలు చేపట్టే ప్రయోగాలకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. ఎన్ఎస్ఐఎల్ భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని తెలిపారు. 

పీఎస్ఎల్వీ రాకెట్ సామర్థ్యానికి ఈ ప్రయోగం గీటురాయిలా నిలుస్తుందని ఇస్రో ఓ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ అంతరిక్ష ఆవిష్కరణల రంగంలో భారత్ కీలక పాత్ర ఈ ప్రయోగం ద్వారా స్పష్టమైందని వివరించింది.

  • Loading...

More Telugu News