పర్మిషన్ లేనిదే చెప్పనంటున్న రష్మిక!

06-01-2021 Wed 16:52
  • తెలుగులో అగ్రతారగా రాణిస్తున్న రష్మిక 
  • బాలీవుడ్ లో కూడా రెండు ప్రాజక్టులు
  • అభిమానులతో ముచ్చటించిన ముద్దుగుమ్మ
  • కొత్త సినిమాల గురించి చెప్పనన్న నాయిక
Rashmika reluctant to disclose new projects

వరుస విజయాలతో జోరుమీదున్న ప్రెట్టీ డాల్ రష్మిక ఈవేళ టాలీవుడ్ అగ్ర కథానాయికగా రాణిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో 'పుష్ప', శర్వానంద్ తో 'ఆడాళ్లూ మీకు జోహార్లు' సినిమాలతో పాటు బాలీవుడ్ లో రెండు భారీ సినిమాలు చేస్తోంది.  మరోపక్క మాతృభాష కన్నడలో కూడా మరి కొన్ని సినిమాలు కమిట్ అయింది. ఈ  నేపథ్యంలో తాజాగా ఈ చిన్నది సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది.

తెలుగులో రెండు భారీ సినిమాలలో తను నటించనుందంటూ వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆమె వద్ద అభిమానులు ప్రస్తావించగా తన కొత్త సినిమాల గురించి చెప్పడానికి మాత్రం రష్మిక 'నో' చెప్పేసింది. "కొత్త సినిమాలకి సంబంధించి నా నుంచి మీరేమీ లాగలేరు.. వాటి గురించి మాట్లాడడానికి నాకు పర్మిషన్ వచ్చేవరకు వాటి గురించి నేనేమీ చెప్పలేను..' అంటూ తెలివిగా తప్పించుకుంది. దీనిని బట్టి ఆయా ప్రాజక్టుల గురించి మీడియాకు చెప్పద్దంటూ నిర్మాతలు అమ్మడికి ఆంక్షలు పెట్టినట్టున్నారు కదూ!