Aargoyasethu: ఏపీలో గత 24 గంటల్లో ‘కరోనా’ పాజిటివ్ కేసులు 60
- గత ఇరవై నాలుగు గంటల్లో 7,782 శాంపిల్స్ పరీక్ష
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 1,777
- ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1012
ఏపీలో గత ఇరవై నాలుగు గంటల్లో 7,782 శాంపిల్స్ ని పరీక్షించగా, 60 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,777 పాజిటివ్ కేసులకు గాను 729 మంది డిశ్చార్జి అయ్యారని, 36 మంది మృతి చెందారని పేర్కొంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1012గా తెలిపింది. కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు, ఆ తర్వాత గుంటూరు, కృష్ణా ఉన్నాయి.