Ala Vaikunthapuramulo: ‘అల..వైకుంఠపురములో’కు సంబంధించి ఆ రెండు విషయాలు దాచాం: త్రివిక్రమ్ శ్రీనివాస్

  • ఆ రెండు విషయాల్లో ఒకటి ‘సిత్తరాల..’ పాట
  • షూట్ కు ముందు రోజు రాత్రే ఆ పాట మాకు అందింది
  • రెండో విషయం.. బ్రహ్మానందం నటించినట్టు చెప్పకపోవడం

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ‘థ్యాంక్స్ మీట్’ ను ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘అల.. వైకుంఠపురములో’ విడుదల కాక ముందు దీనికి సంబంధించిన చాలా విషయాలు బయటకు చెప్పినా, ఓ రెండు విషయాలను మాత్రం దాచామని అన్నారు.

 ఆ రెండు విషయాల్లో ఒకటి.. ఈ చిత్రంలోని ‘సిత్తరాల..’ పాట అని, శ్రీకాకుళం యాసలో ఈ పాట ఉంటుందని చెప్పారు. దీనిని షూట్ చేయడానికి ముందు రోజు రాత్రే ఆ పాట తమకు అందిందని, దీంతో, అప్పటికప్పుడు షూట్ చేశామని, అరగంటలో తమన్ ట్యూన్ చేశాడని, ఈ పాటను ఫైట్ గా తీశామని అన్నారు. ‘సిత్తరాల..’ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. రెండో విషయం.. బ్రహ్మానందం ఈ సినిమాలో నటించిన విషయాన్ని ముందే చెప్పకుండా దాచడం చాలా కష్టమైందని త్రివిక్రమ్ చెప్పారు.

More Telugu News