Bellamkonda srinivas: కొత్త సినిమా కోసం బెల్లంకొండ సిక్స్ ప్యాక్

  • బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రానికి సన్నాహాలు 
  • రేపు ఉదయం పూజా కార్యక్రమాలు 
  • కొత్త లుక్ తో కనిపించనున్న బెల్లంకొండ 

మాస్ యాక్షన్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్, ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాక్షసుడు' భారీ విజయాన్ని అందుకుంది. ఆ ఉత్సాహంతో ఆయన మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.

'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ఆయన ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ గుబురు గెడ్డం .. కొత్త హెయిర్ స్టైల్ తో .. సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. సిక్స్ ప్యాక్ కోసం జిమ్ లో ఆయన గట్టి కసరత్తులే చేశాడు. రేపు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలను అందిస్తున్నాడు.

More Telugu News