Diwali: కులమతాలకు అతీతంగా భారతీయులందరూ జరుపుకునే పండుగ దీపావళి: పవన్ కల్యాణ్

  • ప్రజలకు జనసేనాని దీపావళి శుభాకాంక్షలు
  • కొత్తకాంతులు తీసుకురావాలని ఆకాంక్ష
  • పరిమితంగా బాణసంచా కాల్చాలని సూచన

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపాన్ని భారతీయులు పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారని, మనోవికాసానికి ప్రతీకగా పరిగణిస్తారని ట్విట్టర్ లో వివరించారు. కులమతాలకు అతీతంగా భారతీయులందరూ జరుపుకునే పండుగ దీపావళి అని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శ్రమజీవుల జీవితాల్లో ఈ దీపకాంతులు కొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వర్షాకాలంలో వచ్చే క్రిమికీటకాలు అనారోగ్యాలు కలిగిస్తుంటాయని, వాటిని పారద్రోలేందుకే దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చుతుంటారని పవన్ వెల్లడించారు. అయితే పర్యావరణానికి భంగం కలగని రీతిలో పరిమితంగా బాణసంచా కాల్చాలని సూచించారు.

More Telugu News