Ala Vaikuntapuramulo: 'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఫిక్స్

  • 2020 జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల
  • ట్వీట్ చేసిన అల్లు అర్జున్
  • లేటెస్ట్ పోస్టర్ లో బన్నీ మాస్ లుక్

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా ట్వీట్ చేశాడు. అందులో బన్నీ, తలపాగా కట్టి,  ఓ చేతిలో పందెంకోడి, మరో చేతిలో వేటకత్తితో మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు.

ఇటీవలే దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి వచ్చిన 'సామజ వర గమన' సాంగ్ విశేష ప్రాచుర్యం పొందుతోంది. ఎక్కడ చూసినా ఈ పాట మార్మోగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

More Telugu News