Bellamkonda: 'రాక్షసుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం

  • యాక్షన్ థ్రిల్లర్ గా 'రాచ్చసన్'
  • రేపు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • వచ్చేనెల 2వ తేదీన సినిమా రిలీజ్ 

రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా 'రాక్షసుడు' సినిమా రూపొందింది. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, తమిళ హిట్ మూవీ 'రాచ్చసన్'కి రీమేక్ గా నిర్మితమైంది. ఆగస్టు 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది.

హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ ఈ వేడుకకి వేదిక కానుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక అనుపమా పరమేశ్వరన్ కూడా తన కెరియర్ ఊపందుకునే సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఈ ఇద్దరి ముచ్చటను ఈ సినిమా తీర్చేస్తుందేమో చూడాలి. 

More Telugu News