Nandadevi: హిమాలయ పర్వతాల్లో ఐదుగురు పర్వతారోహకుల మృతదేహాల గుర్తింపు

  • ముగ్గుర్ని కాపాడిన భారత వాయుసేన
  • ఘటన స్థలాన్ని ఫొటోలు తీసిన ఓ పర్వతారోహకుడు
  • ఆ ఫొటోల్లో కనిపించిన మృతదేహాలు

హిమాలయ పర్వతాల్లో నిన్న ఎనిమిదిమంది పర్వతారోహకులు గల్లంతైన విషయం తెలిసిందే. నందాదేవి పర్వతాన్ని అధిరోహించే క్రమంలో భారత్ సహా పలు దేశాలకు చెందిన పర్వతారోహకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారందరూ బేస్ క్యాంపుకు చేరుకోకపోవడంతో గల్లంతై ఉంటారని భావించారు. వారికోసం భారత వాయుసేన హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ముగ్గురు పర్వతారోహకులను ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కాపాడారు.

వారిలో మార్క్ థామస్ అనే పర్వతారోహకుడు తాను మంచులో దిగబడిపోయిన ప్రాంతంలో కొన్ని ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను పరిశీలించిన వాయుసేన సిబ్బంది ఐదుగురు పర్వతారోహకుల మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలు మంచులో కూరుకుపోయి ఉండడంతో వెలికితీసేందుకు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News