kajal: విడుదలకి సిద్ధమవుతోన్న 'సీత'

  • తేజ దర్శకత్వంలో రూపొందిన 'సీత'
  • ప్రధాన పాత్రధారిగా కాజల్ 
  • ఈ నెల 24వ తేదీన భారీ విడుదల

కాజల్ ప్రధాన పాత్రధారిగా తేజ దర్శకత్వంలో 'సీత' రూపొందింది. కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి 'యు' సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సోనూ సూద్ నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో తేజ మాట్లాడుతూ, ఈ పాత్ర తానే చేస్తానని కాజల్ పట్టుబట్టినట్టుగా చెప్పాడు. ఈ పాత్ర ఆమె కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దాంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి. 

More Telugu News