kajal: 'సీత' కొత్త విడుదల తేదీ ఇదే

  • కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత'
  • కీలకమైన పాత్రలో సోనూసూద్
  •  మే 24వ తేదీన సినిమా విడుదల        

కాజల్ ప్రధాన పాత్రధారిగా .. అనిల్ సుంకర నిర్మాతగా 'సీత' రూపొందింది. ఈ సినిమాలో కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల చివరిలో విడుదల చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వలన ఈ నెల చివరిలో ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదు. వచ్చేనెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, సోనూ సూద్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఈ పాత్రను తేజ డిజైన్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత తెలుగులో సోనూ సూద్ బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువని చెప్పుకుంటున్నారు. కాజల్ కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News