kajal: మాస్ ఆడియన్స్ ను హుషారెత్తించే 'బుల్ రెడ్డి' ఐటమ్ సాంగ్

  • కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత' 
  • ఐటమ్ భామగా పాయల్ రాజ్ పుత్
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  

తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత' సినిమా నిర్మితమైంది. మోడ్రన్ సీతగా .. తనకి నచ్చినట్టుగా ప్రవర్తించే సీతగా ఈ సినిమాలో కాజల్ కనిపించనుంది. ఆమె జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు. ఈ సినిమాలో 'బుల్ రెడ్డి' అనే ఐటమ్ సాంగులో పాయల్ రాజ్ పుత్ సందడి చేసింది. ఇటీవల వదిలిన లిరికల్ సాంగుకి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాంతో తాజాగా ఈ సినిమా నుంచి ఈ సాంగ్ ప్రోమోను వదిలారు.

'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ పాయల్ స్టెప్స్ అదరగొట్టేసింది. ఈ పాటలో పాయల్ అందాలను ఒక రేంజ్ లో ఆరబోసేసింది. సాహిత్యం .. సంగీతం .. కొరియోగ్రఫీ .. చిత్రీకరణ అన్నీ కూడా మాస్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా వున్నాయి. తేలికైన పదాలతో రాసిన హుషారైన గీతం కావడంతో, అన్ని ఏరియాల్లో ఈ సాంగ్ హల్ చల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వైపున హీరోయిన్ గా మరో వైపున ఐటమ్ భామగా కూడా పాయల్ బిజీ అవుతుందని అనుకుంటున్నారు.

More Telugu News