bellamkonda: 'బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి' అంటూ హాట్ ఐటమ్ తో దుమ్మురేపేస్తోన్న పాయల్

  • కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత'
  • ఐటమ్ సాంగులో మెరిసిన పాయల్ 
  • వచ్చేనెలలో సినిమా విడుదల

తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత' నిర్మితమైంది. కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. 'ఆర్ ఎక్స్ 100' అందాల భామ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో హాట్ హాట్ గా ఒక ఐటమ్ చేసింది. పాయల్ పై చిత్రీకరించిన ఆ ఐటమ్ సాంగ్ ను తాజాగా వదిలారు.

"బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి .. రాజ్ దూత్ మీదొచ్చే రామ్ రెడ్డి .. యమహా ఏసుకొచ్చే యాదిరెడ్డి .. బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి .."అంటూ ఈ పాట జోరుగా .. హుషారుగా సాగుతోంది. నవ్వు తెప్పించే అంశాలకి మసాలాను జోడించి .. శృంగారభరితంగా వదిలిన ఈ పాట, తెరపై దుమ్మురేపేస్తుందనే అనిపిస్తోంది. మాస్ కి  కావలసిన అంశాలు పాటలో పుష్కలంగా ఉండటం వలన, మాస్ ఏరియాల్లో ఈ పాట దూసుకుపోతుందని చెప్పొచ్చు. వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, సక్సెస్ ను సాధించడం ఖాయమనే మాట ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది

More Telugu News