Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తెలుగులో అనుపమ మరో చిత్రం 
  • శ్రీవాస్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ 
  • ప్రిన్స్ కథానాయకుడిగా 'రాడికల్'    

*  అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మరో చిత్రానికి సంతకం చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా ఆమె ఎంపికైంది. వచ్చే వారం అనుపమ ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతుందట.
*  తాజాగా '118' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ మరో చిత్రానికి ఓకే చెప్పాడు. 'సాక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  'సూపర్ స్టార్ కిడ్నాప్' ఫేం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ప్రిన్స్ కథానాయకుడుగా 'రాడికల్' పేరిట ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం రెండో షెడ్యూలు ఈ నెల 18 నుంచి  హైదరాబాదులో జరుగుతుంది.

More Telugu News