bellamkonda: 'రాచ్చసన్' రీమేక్ కోసం రంగంలోకి దిగిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్

  • తెలుగులోకి 'రాచ్చసన్' రీమేక్ 
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ
  •  దర్శకుడిగా రమేశ్ వర్మ

బెల్లంకొండ శ్రీనివాస్ జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 'తేజ' దర్శకత్వంలో 'సీత' సినిమా చేస్తోన్న ఆయన, మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. ఈ రోజునే ఆయన కొత్త సినిమా లాంఛనంగా మొదలైంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా .. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కోనేరు హవీశ్ ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ రోజు ఉదయం ఈ సినిమా హైదరాబాద్ . రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన 'రాచ్చసన్' సినిమాకి ఇది రీమేక్. విష్ణువిశాల్ .. అమలాపాల్ జంటగా నటించిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో .. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి. 

More Telugu News