kajal: తేజ సినిమా టైటిల్ చెప్పేసిన కాజల్!

  • తేజ దర్శకత్వంలో కాజల్ 
  • కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ 
  • మార్చిలో సినిమా విడుదల     

తేజ దర్శకత్వంలో కాజల్ ఒక సినిమా చేస్తోంది. ఇది నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా .. హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్నాడు. ఈ సినిమాకి 'సీత' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే దర్శక నిర్మాతలు అధికారికంగా టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తిరుపతిలోని ఒక కార్యక్రమానికి వెళ్లిన కాజల్, ఈ సినిమాకి 'సీత' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా చెప్పేసింది.

ఇక ఈ సినిమాను మార్చిలో విడుదల చేసేదిశగా పనులు జరుగుతున్నట్టుగా కూడా చెప్పేసింది. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకు .. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంది. తన పాత్ర అందరికీ నచ్చుతుందనీ .. తనకి మరింత మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. టైటిల్ విషయాన్ని .. రిలీజ్ సమయాన్ని ఉత్సాహంగా కాజల్ చెప్పేయడం, దర్శక నిర్మాతలకు కాస్త ఇబ్బందిని కలిగించే విషయమేనని చెప్పాలి. 

More Telugu News