bellamkonda srinivas: మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

  • మాస్ హీరోగా మంచి గుర్తింపు 
  • దాగుడుమూతలాడుతోన్న సక్సెస్
  • త్వరలోనే పట్టాలపైకి కొత్త ప్రాజెక్టు

కెరియర్ ఆరంభంలోనే మాస్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మార్కులు కొట్టేశాడు. అయితే కొంతకాలంగా సక్సెస్ అనేది ఆయనతో దోబూచులాడుతోంది. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ప్రస్తుతం ఆయన తేజ దర్శకత్వంలో 'సీత' అనే సినిమా చేస్తున్నాడు. కాజల్ ఇందులో కథానాయిక. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది.

ఈ రోజున బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్తప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. కోనేరు సత్యనారాయణ .. కోనేరు హవీష్ లక్ష్మణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రమేశ్ వర్మ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. కొత్త లుక్ తో ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడట. కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.  

More Telugu News