sruthihasan: అడ్వాన్స్ ఇస్తేనే షూటింగుకి వస్తానని తేల్చి చెప్పిన శ్రుతిహాసన్

  • తెలుగు .. తమిళ భాషల్లో క్రేజ్ 
  • హిందీ సినిమాలపైనే ఫోకస్ 
  • పారితోషికం విషయంలో బలమైన నిర్ణయం     

తెలుగు .. తమిళ భాషల్లో గ్లామర్ క్వీన్ గా మంచి మార్కులు కొట్టేసిన శ్రుతి హాసన్, ఆ తరువాత హిందీ సినిమాలపైనే ఫోకస్ ఎక్కువగా పెట్టింది. అక్కడ ఆమెకి ఆశించిన స్థాయిలో హిట్లు పడకపోగా, తెలుగు .. తమిళ సినిమాలకు దూరమైపోయింది. ఏ విషయమైనా ముక్కుసూటిగా వ్యవహరించడం శ్రుతి హసన్ కి అలవాటు. ఇదే విషయం మరోసారి స్పష్టమైంది.

మరాఠీ చిత్రాల దర్శకుడు .. నటుడు మహేశ్ మంజ్రేకర్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన శ్రుతి హాసన్ ను ఎంపిక చేసుకున్నాడు. ఆయన షూటింగ్ డేట్ ఇచ్చేసి .. ఆ రోజు రాగానే షూటింగుకి రమ్మని ఫోన్ చేశాడట. నిర్మాతలతో ముందుగా మాట్లాడుకున్న ప్రకారం పారితోషికంలో సగం అడ్వాన్స్ గా ఇస్తేనే షూటింగుకు వస్తాననీ .. లేదంటే రానని శ్రుతి హాసన్ తేల్చి చెప్పేసిందట. పారితోషికం విషయంలో శ్రుతి హాసన్ కి గతంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాల కారణంగానే ఆమె అలా కఠినంగా వ్యవహరించడానికి కారణమై వుంటుందనే టాక్ వినిపిస్తోంది. 

  • Loading...

More Telugu News