bhikshu: జూనియర్ ఎన్టీఆర్ కి మంచి జ్ఞాపకశక్తి వుంది: నటుడు భిక్షు

  • అప్పట్లోనే ఎన్టీఆర్ ఎంతో చురుకుగా ఉండేవాడు
  • సరదాగా తోటి పిల్లలను ఏడిపించేవాడు 
  • నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించాడు    

నటుడిగా .. నట శిక్షకుడిగా 'భిక్షు'కి మంచి పేరుంది. అలాంటి భిక్షు తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. "గుణశేఖర్ 'బాలల రామాయణం' తెరకెక్కించినప్పుడు ఎంపిక చేసిన పిల్లలందరితో వర్క్ షాప్ నిర్వహించాము. డైలాగ్ ఎలా చెప్పాలి .. హావభావాలు ఎలా పలికించాలి? అనేది వాళ్లకి చెప్పేవాడిని. ఆ పిల్లలలో ఎన్టీఆర్ కూడా ఉండేవాడు.

ఎన్టీఆర్ చాలా చురుకుగా ఉండేవాడు .. సరదాగా తన తోటి పిల్లలను ఏడిపించేవాడు. ఎన్టీఆర్ కి మంచి జ్ఞాపక శక్తి వుంది. ఎలాంటి డైలాగ్ అయినా గుర్తుపెట్టుకుని వెంటనే చెప్పేసేవాడు. ఆ మధ్య వచ్చిన 'జనతా గ్యారేజ్' లో నేను ఒక ఫ్రేమ్ లో కనిపించాను. ఆ సినిమా షూటింగు సమయంలో నన్ను గుర్తు పెట్టుకుని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. 'బాల రామాయణం' సమయంలో అలా చూసిన ఎన్టీఆర్ ను ..ఇప్పుడు ఇలా చూడటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది" అని ఆయన చెప్పుకొచ్చారు.    

  • Loading...

More Telugu News