bellamkonda srinivas: 'కవచం'లో ఊహించని మలుపులుంటాయి: బెల్లంకొండ శ్రీనివాస్

  • యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుంది 
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను
  • తప్పకుండా హిట్ కొడతాను       

మొదటి నుంచి కూడా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు భారీతనంతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడం లేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన 'కవచం' సినిమా చేశాడు. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ .."ఈ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను. తనని చుట్టుముట్టిన సమస్యలను ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుంది. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకి ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ గా సాగే ఈ కథలో ఆడియన్స్ ఊహించని మలుపులు ఉంటాయి. విడుదలకి ముందే శాటిలైట్ రైట్స్ రూపంలో 20 కోట్లు రావడం విశేషం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వుంది'' అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.  

More Telugu News