vijayarangaraju: నాకు పేరొచ్చిందని మోహన్ లాల్ హర్ట్ అయ్యాడు: నటుడు విజయ రంగరాజు

  • మలయాళంలో 'వియత్నం కాలని' చేశాను
  • ఏడాది పాటు ఆ సినిమా ఆడింది 
  • బస్తాల కొద్దీ నాకు ఉత్తరాలు వచ్చేవి      

గంభీరమైన రూపం .. ఆ రూపానికి తగిన గంభీరమైన స్వరం విజయరంగరాజు సొంతం. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పుకొచ్చారు. "మలయాళంలో 'వియత్నం కాలని' సినిమాలో విలన్ పాత్రను చేశాను. ఆ పాత్ర నాకు ఎంతో క్రేజ్ ను తెచ్చిపెట్టింది. బస్తాల కొద్దీ ఉత్తరాలు వచ్చేవి .. విదేశాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవి. ఆ సినిమా ఒక ఏడాది పాటు ఆడింది.

విశేషం ఏమిటంటే, ఆ సినిమా ఒక ఏడాది పాటు ఆడినా, తన కెరియర్లో అదొక బ్యాడ్ ఫిల్మ్ అని మోహన్ లాల్ రాసుకున్నారు. అందుకు కారణం ఆ సినిమా వలన నాకు ఎక్కువ పేరు రావడమే. ఆ తరువాత కొంత కాలానికి ఒక సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో దర్శకుడు సిద్ధిక్ గారు నాకు తారసపడ్డారు. 'మలయాళంలో నీకు అవకాశాలు రాకపోవడానికి కారణమేమిటో తెలుసా?' అని అడిగారు. 'తెలియదు' అని చెప్పాను. 'వియత్నం కాలని' సినిమాకి సంబంధించి పేరు మొత్తం నీకు వచ్చేసిందని మోహన్ లాల్ హర్ట్ అయ్యాడు .. అదే కారణం' అని అన్నాడంటూ చెప్పుకొచ్చారు.    

  • Loading...

More Telugu News