bellamkonda srinivas: భారీ చిత్రాలకు బై.. రూటు మార్చిన బెల్లంకొండ శ్రీనివాస్!

  • ఇన్నాళ్లూ భారీ సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ 
  • వరుసగా నష్టాలు తెచ్చిపెట్టిన ప్రాజెక్టులు 
  • చిన్న సినిమాలపై దృష్టి పెట్టిన బెల్లంకొండ

బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి నుంచి కూడా భారీ సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. స్టార్ హీరోయిన్స్ తో జోడీ కడుతూ .. ఫారిన్ లొకేషన్స్ లో డ్యూయెట్స్ పాడుతూ వస్తున్నాడు. ఒక స్టార్ హీరో సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో .. ఆ స్థాయిలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు తెరకెక్కుతూ వస్తున్నాయి. అయితే ఖర్చు పెట్టినంత స్థాయిలో బెల్లంకొండ శ్రీనివాస్ కి మార్కెట్ లేకపోవడం వలన, సహజంగానే నష్టాలు వస్తున్నాయి.

అందువల్లనే ఇకపై బెల్లంకొండ శ్రీనివాస్ తో పెద్ద సినిమాలు చేయించకుండా, కంటెంట్ వున్న చిన్న సినిమాలు చేయించాలనే నిర్ణయానికి నిర్మాత బెల్లంకొండ వచ్చినట్టు సమాచారం. కొత్త దర్శకుల దగ్గర సిద్ధంగా వున్న కథలను వరుసబెట్టి బెల్లంకొండ వింటున్నాడట. కంటెంట్ కొత్తగా వుందనిపిస్తే సెట్స్ పైకి పంపించేస్తాడన్న మాట. దీనిని బట్టి బెల్లంకొండ శ్రీనివాస్ కొంతకాలం పాటు కొత్త దర్శకులతో చిన్న సినిమాలు చేయనున్నట్టు స్పష్టమవుతోంది.  

More Telugu News