Kajal Agarwal: కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ ల 'కికి' ఛాలెంజ్.. వీడియో చూడండి

  • వెరైటీగా కికి ఛాలెంజ్ లో పాల్గొన్న కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్
  • ప్రపంచాన్ని కుదిపేస్తున్న కికి ఛాలెంజ్
  • పలువురు ప్రాణాలను కూడా పోగొట్టుకున్న వైనం

కికి ఛాలెంజ్ ఇప్పటికే ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణిస్తున్న వాహనం నుంచి కిందకు దిగి డ్యాన్స్ చేస్తూ, మళ్లీ వాహనంలోకి ఎక్కడమే ఈ ఛాలెంజ్. ఈ డ్యాన్స్ ను వీడియో తీసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలి. చూడ్డానికి ఈ ఛాలెంజ్ చాలా సరదాగా ఉన్నప్పటికీ, ఎంతో మంది ఈ ఛాలెంజ్ వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో, ఈ ఛాలెంజ్ పై పోలీసులు నిషేధం విధించారు.

ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్, నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ లు సరదాగా కికి ఛాలెంజ్ లో పాల్గొన్నారు. అయితే, రోడ్డుపై కాకుండా సురక్షితమైన ప్రాంతంలో, కొంచెం వెరైటీగా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News