samanta: థ్రిల్లర్ మూవీ .. టాక్సీ డ్రైవర్ గా సమంత!

  • దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా శిష్యుడు
  • హాలీవుడ్ మూవీ నుంచి కథా వస్తువు 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు

ప్రస్తుతం సమంత తెలుగులో 'యూ టర్న్' సినిమా చేస్తోంది .. తమిళంలో 'సీమరాజా' సినిమా చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల తరువాత ఆమె ఒక థ్రిల్లర్ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ లో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన 'కొలాటెరల్' ఘనవిజయాన్ని సాధించింది. దాంతో ఈ సినిమా నుంచి మూలాన్ని తీసుకుని .. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చుకుని సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.

సందీప్ రెడ్డి వంగా శిష్యుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కీలకమైనదిగా కనిపించే టాక్సీ డ్రైవర్ పాత్ర కోసం సమంతను తీసుకున్నారట. ఈ పాత్రకి గల ప్రాధాన్యత కారణంగా సమంత అంగీకరించిందని అంటున్నారు. ఈ సినిమాలోని ఇతర ముఖ్యమైన పాత్రల్లో మురళీశర్మ .. అరుణ్ ఆదిత్ .. నవదీప్ .. సాయిచంద్ కనిపించనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.    

  • Loading...

More Telugu News