Andhra Pradesh: ఏపీలో అవెరా సంస్థ కొత్త ప్లాంట్

  • విజయవాడలోని నున్నలో ప్లాంట్  
  • 63 ఎకరాల్లో రూ.50 కోట్లతో ఏర్పాటు చేయనున్న వైనం
  • ఏడాదికి 25,000 యూనిట్ల సామర్థ్యంతో పని చేయనున్న ప్లాంట్ 

ఏపీలో మరో కొత్త ప్లాంట్ ఏర్పాటు కానుంది. విద్యుత్ బ్యాటరీ స్కూటర్లు తయారు చేసే అవెరా న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మోటో కార్ప్ టెక్ సంస్థ కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆభరణాలు, టెక్స్ టైల్ రిటైల్ వ్యాపార రంగాల్లో ఉన్న చందన గ్రూపునకు చెందిన అవెరా విద్యుత్ వాహనాల తయారీలోకి ప్రవేశించింది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే రెండు విద్యుత్ బ్యాటరీ స్కూటర్లు రెండు మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. వచ్చే ఏడాది మరి కొన్ని మోడల్స్ ను ప్రవేశపెట్టనుంది. విజయవాడకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నున్నలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతోంది.

63 ఎకరాల్లో రూ.50 కోట్లతో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్టు అవెరా సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎ. వెంకట రమణ తెలిపారు. మొదటగా పది ఎకరాల్లో 1.8 కిలోమీటర్ల టెస్టింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని, ఆ తర్వాత ప్లాంట్ ను విస్తరిస్తామని చెప్పారు. ఈ ప్లాంట్ ను తొలుత ఏడాదికి 25,000 యూనిట్ల సామర్థ్యంతో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సోలార్ పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నామని, అమరాతిలో ఈ తరహా ఛార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.  

  • Loading...

More Telugu News