cydabad: సైదాబాద్ జువైనల్ హోం నుంచి పారిపోయిన పదిహేను మంది బాలురు!
- పోలీసులకు ఫిర్యాదు చేసిన జువైనల్ హోం అధికారులు
- కిటికీ చువ్వలను వంచి తప్పించుకున్నట్టు గుర్తింపు
- ఈ సంఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
- ఇద్దరు సూపర్ వైజర్లు, సూపరింటెండెంట్ సస్పెన్షన్
హైదరాబాద్ లోని సైదాబాద్ జువైనల్ హోం నుంచి పదిహేను మంది బాలురు పారిపోయారు. ఈ విషయాన్ని జువైనల్ హోం అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
జువైనల్ హోం వెనుక ఉన్న గోడ కిటికీ ఇనుప చువ్వలను వంచి అక్కడి నుంచి వారు బయటపడినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను సేకరించి పరిశీలించారు. కాగా, ఈ సంఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. జువైనల్ హోంకు చెందిన ఇద్దరు సూపర్ వైజర్లు, సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.