samanta: ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సంతోషంగా వున్న అమ్మాయిని నేనే!: సమంత

  • 'రంగస్థలం'తో భారీ విజయం 
  • హిట్ అనిపించుకున్న 'మహానటి'
  • సక్సెస్ టాక్ తెచ్చుకున్న 'ఇరుంబు తిరై'    

సాధారణంగా హ్యాట్రిక్ హిట్ పడటమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ హ్యాట్రిక్ హిట్ పడినా .. ఆయా సినిమాల మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. కానీ సమంత మాత్రం చాలా తక్కువ గ్యాప్ లో వరుసగా మూడు సక్సెస్ లు అందుకుంది. చరణ్ జోడీగా ఆమె నటించిన 'రంగస్థలం' సంచలన విజయాన్ని నమోదు చేసింది. మొన్న 9వ తేదీన విడుదలైన 'మహానటి' కూడా ఆమెకి విజయాన్ని అందించింది.

 ఇక తమిళంలో విశాల్ సరసన ఆమె చేసిన 'ఇరుంబు తిరై' ఈ రోజునే విడుదలై అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దాదాపు ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలోకి చేరిపోయినట్టేననే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సమంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మూడు సినిమాలకి సంబంధించిన స్టిల్స్ ను పోస్ట్ చేస్తూ, 'ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఆనందంగా వున్న అమ్మాయిని నేనే' అంటూ ట్వీట్ చేసింది.     

  • Loading...

More Telugu News