Rahul Gandhi: కానిస్టేబుల్‌ ఉద్యోగ అభ్యర్థుల ఛాతిపై కులం పేరు.. మధ్యప్రదేశ్‌ సర్కారుపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం

  • ఇది బీజేపీ సర్కారు జాత్యహంకార వైఖరికి నిదర్శనం
  • చాతీపై ఎస్సీ, ఎస్టీ అని రాసి రాజ్యాంగంపై దాడి చేసింది
  • ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చిన ఆలోచనే

మధ్యప్రదేశ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఛాతీపై వారి కులం పేరును స్కెచ్‌ పెన్ తో రాశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు మీడియాకు చిక్కడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంబంధిత అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. వేర్వేరు కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కావాల్సిన శారీరక ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నాయని, అందుకే అభ్యర్థుల ఛాతీపై కులం పేరు రాసినట్లు వైద్య సిబ్బంది పోలీసులకు చెప్పారని ధార్‌ ఎస్పీ అన్నారు. ఏదేమైనా ఈ ఘటన తీవ్రమైన వ్యవహారమని అన్నారు.

కాగా, ఈ ఘటనపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ సర్కారు జాత్యహంకార వైఖరికి నిదర్శనమని, మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం యువకుల చాతీపై ఎస్సీ, ఎస్టీ అని రాసి రాజ్యాంగంపై దాడి చేసిందని ట్వీట్‌ చేశారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చిన ఆలోచనే అని పేర్కొన్నారు.      

  • Loading...

More Telugu News