Rahul Gandhi: నిజమే, మీరు అంబేద్కర్ ను చాలా గౌరవించారు..ఇలాగేనా?: మోదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రాహుల్ గాంధీ

  • వెస్ట్రన్‌ కోర్ట్‌ ఎన్నెక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విపక్షాలను విమర్శించిన మోదీ
  • అంబేద్కర్ కు తాము మాత్రమే సముచిత గౌరవం ఇస్తున్నామంటూ మండిపాటు
  • కౌంటర్ గా ఫోటోలు పెట్టి ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

భారత రాజ్యాంగ కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు తాము ఇచ్చినంత గౌరవం గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ హౌస్‌ లో ఎంపీల వసతి కోసం నిర్మిస్తున్న వెస్ట్రన్‌ కోర్ట్‌ ఎన్నెక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. పనిలోపనిగా విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. వాటిన్నింటికీ ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంబేద్కర్ ను గౌరవించే విషయంలో బీజేపీ అవలంబిస్తున్న విధానాలను చూడండంటూ ఆయన కొన్ని ఫొటోలను పంచుకున్నారు.

గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరిగిన పలు ఘటనల్లో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాల తాలుకూ ఆ ఫొటోలను పెడుతూ, ‘బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ పాలిత దేశంలో అంబేద్కర్ కు దక్కిన గౌరవాన్ని చూడండి. దేశంలోని దళితులను, అంబేద్కర్ ను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఎన్నటికీ గౌరవించవని పేర్కొన్నారు. రాజ్యాంగ పితను గౌరవిస్తున్నామని చెప్పుకుంటున్న మోదీ, ముందు ఆయన (అంబేద్కర్) విగ్రహాలు ధ్వంసం కాకుండా చూసుకోవాలి' అని హితవు పలికారు. 

  • Loading...

More Telugu News