Chandrababu: కనీస సాయం చేయకుండా ఏపీపై ఎదురుదాడికి దిగుతున్నారు: ఢిల్లీలో మీడియా సమావేశంలో చంద్రబాబు

  • ఏపీకి బీజేపీ న్యాయం చేస్తుంద‌నే ఎన్డీఏలో చేరాం
  • 29 సార్లు ఢిల్లీకి వచ్చాను
  • ఏపీ విడిపోయి నాలుగేళ్లయినా సాయం చేయలేదు
  • విభజన సమయంలో చాలా నష్టపోయాం

విభజనతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఢిల్లీలో జాతీయ మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విభజన శాస్త్రీయంగా జరగాలని అప్పట్లో తాను కోరానని, విభజన వల్ల వచ్చే సమస్యలపై శ్వేత పత్రం కూడా విడుదల చేశామని అన్నారు.  ఏపీకి బీజేపీ న్యాయం చేస్తుంద‌నే ఎన్డీఏలో చేరామని, విభజన వల్ల వచ్చిన నష్టంపై సాయం చేయాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నామని, తాను 29 సార్లు ఢిల్లీకి వచ్చానని తెలిపారు.

ఏపీ విడిపోయి నాలుగేళ్లయినా సాయం చేయలేదని, విభజన సమయంలో చాలా నష్టపోయామని వివరిస్తూ చెబుతోన్నా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోలేదని చంద్రబాబు అన్నారు. ఏపీకి సాయం చేస్తున్నామంటూ, త్వరలోనే మరింత సాయం అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్ వరకు తాము ఎదురు చూశామని, చివరి బడ్జెట్‌లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక సాయం ఏమీ చేయలేదని విమర్శించారు. కనీస సాయం చేయకుండా ఏపీపై ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. 

  • Loading...

More Telugu News