New Delhi: ఇదిగో.. మీరే చూడండి.. కేంద్రం ఇచ్చింది ఇంతే!: జాతీయ నాయకులకు ఏపీ సీఎం నివేదిక

  • ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ
  • జాతీయ నేతలకు అన్యాయాన్ని వివరించిన వైనం
  • నేతలకు 72 పేజీల నివేదిక అందజేత

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి కేంద్రం మెడలు వంచేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం పలువురు జాతీయ నేతలను  కలిశారు. ఈ సందర్భంగా న్యాయంగా ఏపీకి రావాల్సింది... కేంద్రం ఇచ్చిన దానిని వివరిస్తూ రూపొందించిన 72 పేజీల నివేదికను వారికి అందించారు.
 
బాబు అందించిన నివేదిక ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాల్లానే ఏపీకి కూడా పరిశ్రమలకు రాయితీ, ప్రత్యేక హోదా ఇవ్వాలని పేర్కొంటూ దానికి యూపీఏ కేబినెట్ చేసిన తీర్మాన కాపీని జత చేశారు. పోలవరం కోసం ఏపీ ప్రభుత్వం రూ.7,780 కోట్లు ఖర్చు చేసింది. కేంద్రం నుంచి ఇంకా 2,568 కోట్లు రావాల్సి ఉంది. రూ.16,078 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నా రూ.3,979 కోట్లు మాత్రమే ఇచ్చారు. భూ సమీకరణలో రూ.50 వేల కోట్ల విలువైన 33 వేల ఎకరాలను రైతులు ఇస్తే కేంద్రం రూ.1500 కోట్లు మాత్రమే విడుదల చేసింది.

విశాఖపట్టణం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటుకు రాష్ట్రం రూ.11,600 కోట్ల విలువైన భూములు ఇస్తే కేంద్రం ఇచ్చింది మాత్రం రూ.138 కోట్లే. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఊసే లేదు. 200 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటుకు తొలుత అంగీకరించారు. ఇప్పుడు దానిని 100 మీటర్లకు కుదించి 4 లేన్లకు తగ్గించారని నివేదికలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News