Tollywood: టైమ్ డిసైడ్ చేస్తే పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తా: వి.వి. వినాయక్

  • పవన్ తో సినిమాకు దర్శకత్వం ఎప్పుడు వహిస్తాననేది చెప్పలేను
  • ‘ఖైదీ నంబర్ 150’ తెరకెక్కిస్తున్నప్పుడే ‘ఇంటిలిజెంట్’ గురించి అనుకున్నాం
  • ప్రతి హీరోలో ఓ ప్రత్యేకత ఉంటుంది: వినాయక్

ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ నటించే సినిమాకు ఎప్పుడు దర్శకత్వం వహిస్తారనే ప్రశ్నకు దర్శకుడు వినాయక్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం ఎప్పుడు వహిస్తాననే విషయం తాను చెప్పలేనని, ఆ విషయాన్ని టైమ్ డిసైడ్ చేయాల్సిందేనని అన్నారు.

కాగా, సాయి ధరమ్ తేజ్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇంటిలిజెంట్’. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నంబర్ 150’ తెరకెక్కిస్తున్నప్పుడే సాయిధరమ్ తో ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ప్రతి హీరోలో ఒక ప్రత్యేకత ఉంటుందని, మనం ఎంచుకున్న కథకు తగ్గట్టుగా హీరో ఎంపిక ఉంటుందని, ప్రతి హీరో కష్టపడే పని చేస్తారని అన్నారు.

More Telugu News