redmi5a: రెడ్ మీ 5ఏ కేవలం రూ.4,000కే... బిగ్ బజార్ స్టోర్లలో విక్రయం!
- ఎంఆర్పీ రూ.5,499
- యాక్సిస్ బ్యాంకు కార్డులపై 10 శాతం తగ్గింపు
- ఫ్యూచర్ పే వ్యాలట్ లో రూ.1,000 జమ
- రిపబ్లిక్ డే సేల్ కింద ఆఫర్
షియోమీకి చెందిన బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 5ఏ ను ఇప్పుడు మరింత తక్కువ ధరకు సొంతం చేసుకునే అవకాశం బిగ్ బజార్ కల్పిస్తోంది. రిపబ్లిక్ డే సేల్ కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు ఆఫర్ ప్రకటించింది. రెడ్ మీ 5ఏ ఫోన్ ఆన్ లైన్లో ఎంఐ డాట్ కామ్, ఫ్లిప్ కార్ట్ డాట్ కామ్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు.
బిగ్ బజార్ లో దీని ఎంఆర్పీ రూ.5,499. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపునిస్తోంది. అంటే రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి అదనంగా ఫ్యూచర్ పే వ్యాలెట్ లో రూ.1,000 క్యాష్ బ్యాక్ క్రెడిట్ అవుతుంది. ఫిబ్రవరి నుంచి ఐదు నెలల పాటు ప్రతీ నెలా రూ.200 జమ అవుతుంది. ఈ ఆఫర్ ఈ నెల 22 నుంచి 28 వరకు లేదా స్టాక్స్ అయిపోయే వరకే అమల్లో ఉంటుంది.