KTR: ‘తెలంగాణ’ను ప్రపంచానికి పరిచయం చేస్తా!: దావోస్ లో కేటీఆర్

  • ప్రారంభ ప్లీనరీలో ‘తెలంగాణా’కు ప్రాతినిధ్యం వహించిన కేటీఆర్
  • తొలిసారిగా దావోస్ సదస్సుకు హాజరవుతున్నా
  • పలు ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశమైన కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలోని వ్యాపారానుకూల వాతావరణాన్ని ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి  పరిచయం చేస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు కేటీఆర్ హాజరయ్యారు. ప్రారంభ ప్లీనరీలో తెలంగాణా రాష్ట్రానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఏర్పడిన మూడున్నరేళ్లలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులకు మన రాష్ట్రానికి ఆహ్వానం వస్తున్నప్పటికీ, ఈసారి తొలిసారిగా దావోస్ సదస్సుకు రాష్ట్రం తరపున హాజరవుతున్నానని అన్నారు.

సమావేశం అనంతరం పలు ప్రముఖ కంపెనీల సీఈఓలను ఆయన కలిశారు. ప్రధానంగా ఇండోరమా వెంచర్స్ చైర్మన్ అలోక్ లోహియాతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ కు అలోక్ లోహియా తెలిపారు. బ్యాంకాక్ నగరం కేంద్రంగా పని చేస్తున్న ఈ టెక్స్ టైల్ సంస్థ టెక్స్ లైల్ అనుబంధ ఉత్పత్తులకు ప్రసిద్ధి గాంచింది. తెలంగాణలో టెక్స్ టైల్ పరిశ్రమకు ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ దేశంలోనే అతి పెద్దదని, ఇప్పటికే కొరియా నుంచి ఈ పార్కులో పెట్టుబడులు పెడుతున్నారని, ఇండోరమా సైతం ఈ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. 

  • Loading...

More Telugu News