rahul gandhi: క్రికెటర్ గా రాహుల్ గాంధీ... అల‌రిస్తోన్న పోస్ట‌ర్‌!

  • మోదీపై మణి శంకర్‌ అయ్యర్ అభ్యంత‌ర‌క‌ర‌ వ్యాఖ్య‌లు
  • చాక‌చ‌క్యంగా స్పందించిన రాహుల్‌
  • క్రికెట్ మైదానంలో బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ గాంధీ
  • బాల్‌ రూపంలో అయ్య‌ర్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌  

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్‌ అయ్యర్ నిన్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు అల‌జ‌డి రేపిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందించిన తీరు అంద‌రి మ‌న‌సుల‌ని దోచుకుంది. మ‌ణి శంక‌ర్ అయ్యర్‌ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్న‌ట్లు రాహుల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అంతేకాదు, ఆయ‌న‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. దీంతో నెటిజ‌న్లు రాహుల్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అన్నింట్లో ఓ ట్వీట్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అలహాబాద్‌కి చెందిన కాంగ్రెస్‌ నేత హసీబ్‌ అహ్మద్‌ డిజైన్‌ చేయించిన ఓ పోస్టర్‌.. ఇందులో క‌న‌ప‌డుతోంది. క్రికెటర్ గా మైదానంలో బాల్‌ను  కొడుతున్నట్లు రాహుల్‌ని అందులో చూపించారు. ఈ ఫొటోలో బాల్ రూపంలో అయ్యర్ ఉన్నారు. ఆ బాల్‌ను రాహుల్ గ‌ట్టిగా కొట్టారు. ఈ ఫొటోపై ‘వెల్‌ డన్‌ రాహుల్‌ భయ్యా’ అని రాసి ఉంది.. మీరూ చూడండి... 

  • Loading...

More Telugu News