rahul gandhi: రాహుల్ జీ.. ఇంతకీ విడుదలైన ఉగ్ర‌వాది హఫీజ్ స‌యీద్‌ను పలకరించారా? లేదా?: బీజేపీ చుర‌క‌లు

  • ఉగ్ర‌వాది హఫీజ్ స‌యీద్‌ను విడుద‌ల చేసిన‌ పాక్
  • ట్రంప్‌ను మోదీ మ‌రోసారి ఆలింగనం చేసుకోవాల‌ని రాహుల్ ఎద్దేవా
  • రాహుల్‌ బాబా.. దేశం కోసం నిలబడాలంటూ బీజేపీ చుర‌క‌లు
  • ఉగ్రవాదుల వైపు నిల‌బ‌డ‌కూడ‌దు- జీవీఎల్‌ నరసింహారావు

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన ఆలింగనాలు విఫలమయ్యాయని, మ‌రిన్ని చేయాల్సి ఉంద‌ని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సెటైర్ వేసిన విష‌యం తెలిసిందే. 26/11 ముంబ‌యి ఉగ్ర‌దాడి సూత్ర‌ధారి హఫీజ్‌ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి పాకిస్థాన్ విడిచిపెట్టిన నేప‌థ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలపై భార‌తీయ జ‌న‌తా పార్టీ తాజాగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

రాహుల్‌ దేశం వైపు ఉండాలే కానీ, ముంబయి కీలక సూత్రధారి వైపు కాదు అని బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాహుల్‌ బాబా.. దేశం కోసం నిలబడాలంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. అలవాటు ప్రకారం ఉగ్రవాదుల వైపు నిల‌బ‌డ‌కూడ‌ద‌ని, రాహుల్‌ లష్కరే తొయిబాకు సానుభూతిపరులు అన్న విషయం తెలుసని ఆరోప‌ణ‌లు చేశారు. వికీలీక్స్‌, ఇష్రత్‌ జహాన్‌ కేసుల్లో మీ బంధాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇంతకీ విడుదలైన హఫీజ్‌ సాబ్‌ను పలకరించారా? లేదా? అని చుర‌క‌లంటించారు. 

  • Loading...

More Telugu News