Rahul Gandhi: మార్షల్ ఆర్ట్స్‌లో భాగమైన అకిడోలో గతంలో బ్లాక్ బెల్ట్ సాధించా: రాహుల్ గాంధీ

  • ఢిల్లీలోని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో రాహుల్ గాంధీ
  • భారత బాక్సర్ విజేందర్ సింగ్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పిన రాహుల్
  • గ‌తంలో బ్లాక్ బెల్ట్ సాధించిన విష‌యం ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రితోనూ చెప్ప‌లేదు

జ‌పాన్ మార్షల్ ఆర్ట్స్‌లో భాగమైన అకిడోలో తాను గ‌తంలో బ్లాక్ బెల్ట్ సాధించాన‌ని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు ఢిల్లీలోని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ రాహుల్ గాంధీని ఆ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ ప‌లు విష‌యాల‌పై ప్ర‌శ్నించారు.

విజేంద‌ర్ సింగ్‌ అడిగిన ఓ ప్రశ్నకు రాహుల్ గాంధీ స‌మాధాన‌మిస్తూ.. స్విమ్మింగ్ సహా పలు క్రీడల్లో తాను శిక్ష‌ణ తీసుకున్న‌ట్లు చెప్పారు. తాను బ్లాక్ బెల్ట్ సాధించిన‌ అకిడో క్రీడ గురించి చాలామందికి తెలియదని అన్నారు. ఈ క్రీడలో త్రోయింగ్, జాయింట్ లాకింగ్, స్ట్రిక్కింగ్, పిన్నింగ్ టెక్నిక్స్ వంటివి ఉంటాయని తెలిపారు. త‌న‌కు బ్లాక్ బెల్ట్ వ‌చ్చింద‌న్న విష‌యాన్ని తాను ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా బ‌య‌ట‌పెట్టలేద‌ని చెప్పారు.  

  • Loading...

More Telugu News