khuntiya: మరి కొందరు నేతలు మా పార్టీలోకి వస్తున్నారు: తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ కుంతియా
- టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ నుంచి మరికొంత మంది నేతలు కాంగ్రెస్లోకి
- పార్టీ మరింత బలోపేతం
- 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం
తెలంగాణ టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తోన్న వేళ మీడియాతో మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ కుంతియా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ నుంచి మరికొంత మంది నేతలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమ పార్టీని మరింత బలోపేతం చేసుకుని 2019 ఎన్నికలకు వెళ్తామని అన్నారు. రాష్ట్రంలో 2019లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.