diwali: `దివాలీ ముబార‌క్` అని ట్వీట్ చేసిన కెన‌డా ప్ర‌ధాని... సవరణలు చేసిన హిందూ నెటిజ‌న్లు

  • ఒట్టావాలో ఘ‌నంగా దీపావ‌ళి వేడుక‌లు
  • పాల్గొన్న జ‌స్టిన్ త్రెదో
  • భార‌త పండగ‌ల‌న్నింటికీ విషెస్ చెప్పే ప్ర‌ధాని

భార‌తీయులు ప్రీతిపాత్రంగా జ‌రుపుకునే దీపావ‌ళి పండ‌గ‌కి కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ త్రెదో శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. `దివాలీ ముబార‌క్‌... ఒట్టావాలో ఇవాళ రాత్రి వేడుక‌లు జ‌రుపుకుంటున్నాం` అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఆయ‌న ట్వీట్‌కు హిందూ నెటిజ‌న్లు కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేశారు. దివాలీ హిందువుల పండ‌గ‌ని, దానికి `ముబార‌క్` అనే అర‌బిక్ ప‌దం కాకుండా `బ‌ఢాయి` అనే హిందీ ప‌దం వాడాల‌ని సూచించారు. దీపావ‌ళి విషెస్ అలా చెప్ప‌కూడ‌ద‌ని `శుభ్ దివాలీ` అని చెప్పాల‌ని స‌ల‌హాలు కుమ్మ‌రించారు.

అయితే కెన‌డాకు ప్ర‌ధాని అయిన జ‌స్టిన్ శుభాకాంక్ష‌లు చెప్ప‌డ‌మే ఎక్కువ అనుకుంటే, అందులో స‌వ‌ర‌ణ‌లు చేయ‌డ‌మేంట‌ని కొంత‌మంది నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. `ముబార‌క్‌` అనే ప‌దం బూతు ప‌ద‌మేం కాద‌ని, భాష మారినంత మాత్రాన చెప్పిన వారి భావం మార‌ద‌ని వారు హిత‌బోధ చేశారు. ఏదేమైనా, కెన‌డాలో భార‌తీయ పండ‌గ‌లు జ‌ర‌ప‌డం, వాటికి వారి ప్ర‌ధాని విషెస్ చెప్ప‌డం నిజంగా గొప్ప విష‌య‌మే!

More Telugu News