cricket: చివర్లో ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టిన ధనాధన్ ధోనీ.. ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 282

  • టీమిండియాను ఆదుకున్న ధోనీ, పాండ్యా
  • 79 పరుగులు చేసిన ధోనీ 
  • 83 పరుగులు చేసిన హార్థిక్ పాండ్యా

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జ‌రుగుతోన్న టీమిండియా, ఆస్ట్రేలియా మొద‌టి వ‌న్డే మ్యాచులో భారత్‌ను మ‌హేంద్ర సింగ్ ధోనీ ఆదుకున్నాడు. మొద‌ట ఆచితూచి ఆడుతూ వ‌చ్చిన ధోనీ చివ‌ర్లో త‌న‌దైన రీతిలో ధన్ ధనాధన్ షాట్ల‌ను కొట్టాడు. చివ‌రి ఐదు ఓవ‌ర్లు మిగిలి ఉన్న స‌మ‌యంలో ఫోర్లు, సిక్స‌ర్ల‌తో అల‌రించాడు. చివరకు 49.4 ఓవర్ల వద్ద 79 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్ కి ప్రయత్నించి ఔటయ్యాడు. ధోనీ, హార్థిక్ పాండ్యా మెరుపులతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు రాబట్టింది.

టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో ర‌హానే 5, రోహిత్ శ‌ర్మ 28, కోహ్లీ 0, మ‌నీష్ పాండే 0, కేద‌ర్ జాద‌వ్ 40, హార్థిక్ పాండ్యా 83, మ‌హేంద్ర సింగ్ ధోనీ 79, భువనేశ్వర్ కుమార్ 32, కుల్దీప్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో నాథ‌న్ కౌల్టెర్ మూడు వికెట్లు తీయ‌గా మార్క‌స్ స్టోయినిస్ రెండు వికెట్లు, అడం జంపా, జేమ్స్ ఫౌల్క్ నర్ ఒక వికెట్‌ తీశాడు.
 
20 ఓవ‌ర్ల‌లోపే కీల‌క వికెట్లు కోల్పోవ‌డంతో టీమిండియా అభిమానుల‌కు స్కోరు క‌నీసం 200 దాటుతుందా? అన్న సందేహం వ‌చ్చింది. మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ హార్థిక్ పాండ్యా చూడ‌చ‌క్క‌ని షాట్ల‌తో 66 బంతుల్లో 83 ప‌రుగులు చేయ‌డంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. చివ‌రికి ధోనీ కూడా అద్భుతంగా రాణించ‌డంతో టీమిండియా గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది. టీమిండియాకు ఎక్స్‌ట్రాల రూపంలో 14 పరుగులు వచ్చాయి.

  • Loading...

More Telugu News